ఆంధ్రప్రభ స్పోర్ట్స్ డెస్క్ : క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయని తెలుస్తోంది. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar ) త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నట్లు సమాచారం. నిశ్చితార్థం జరిగిందంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై క్లారిటీ లేక నెటిజన్లు ఫోటోల కోసం నెట్టింట తెగ వెతికేస్తున్నారు.
సానియాను ఫాలో అవుతున్న అర్జున్
ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ (Ravi Ghai) మనవరాలైన సానియా చందోక్(Sania Chandok)తో అర్జున్ నిశ్చితార్ధం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి ఇరు కుటుంబాలకు చెందిన ముఖ్యమైనవారే హాజరయ్యారని సమాచారం. అందుకు సంబంధించిన ఫొటోలు మాత్రం ఇంక బయటికి రాలేదు. కానీ అర్జున్ సానియాను తన ఇన్స్టాగ్రామ్ నుంచి ఫాలో అవుతున్నాడు. కానీ సానియా అర్జున్ను ఫాలో అవుతుందో లేదో అన్ని విషయంపై క్లారిటీ లేదు. ఎందుకంటే సానియా అకౌంట్ ప్రైవేట్‌లో ఉంది. దాని కారణంగా వీరిద్దరి నిశ్చితార్ధం రూమర్స్ ఇంకా బలపడుతున్నాయి. రెండు కుటుంబాలు కూడా ఆ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.
సానియా చందోక్ ఎవరంటే!
సానియా చందోక్ రవి ఘాయ్ మనవరాలు. ఈయన ముంబయికి చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్. వీళ్ల కుటుంబానికి ఆహార రంగంలో వ్యాపారాలు ఉన్నాయి. ఇంటర్ కాంటినెంటల్ హోటల్, ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ బ్రూక్లిన్ క్రీమరీతో పాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. కానీ సానియా మాత్రం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఆమె కూడా ఓ బిజినెస్‌కు పార్ట్నర్గా, డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.