ఏసీబీ అదుపులో సర్వేయర్..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : అవినీతి రెవెన్యూ అధికారులను ఏసీబీ (ACB) అధికారులు వల పన్ని పట్టుకున్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సర్వేయర్ సునీల్ నాగార్జున రెడ్డి (Sunil Nagarjuna Reddy) అనే వ్యక్తి దగ్గర నుండి 10,000 రూపాయలు లంచం తన దగ్గర పనిచేసే వ్యక్తికి ఫోన్ పే (PhonePe) ద్వారా తీసుకోగా ఏసీబీ కరీంనగర్ డిఎస్పి విజయ్ కుమార్ (ACB DSP Vijay Kumar) ఆధ్వర్యంలో పట్టుకున్నారు. సర్వేయర్ సునీల్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ విజయ్ కుమార్ కోరారు.

Leave a Reply