జన్నారం : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్ గుండా భారీ వాహనాల రాకపోకలకు అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు నిర్ణయం మేరకు రాష్ట్ర వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎలూసింగ్ మేరు, పీసీసీఎఫ్ సువర్ణ సర్కులర్ జారీ చేశారు.

10 టైర్లకు మించి ఉన్న భారీ లారీలు, ఇతర వాహనాలు… టైగర్ జోన్‌లోని జన్నారం సహా అనేక మండలాల మీదుగా ప్రయాణించవచ్చు. అయితే ఈ అనుమతి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే వర్తిస్తుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు మాత్రం రాకపోకలు పూర్తిగా నిషేధం.

పర్యావరణ సెస్సు వసూలు

  • భారీ లారీలు (10 టైర్లకు మించి) → ₹150
  • సాధారణ వాహనాలు → ₹50

ఈ మొత్తాన్ని ఉట్నూర్, పాండ్వాపూర్, ఇందనపల్లి, కలమడుగు, తాళ్లపేట, ముత్యంపేట ఫారెస్ట్ చెక్‌పోస్టుల్లో అటవీ సిబ్బంది వసూలు చేసి రసీదు ఇస్తారు.

Leave a Reply