హైదరాబాద్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. షటిల్ ఆడుతూ ఒక్క క్షణంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు! ట్రాన్స్‌ఫార్మర్ (Transformer) పై పడిన షటిల్ కాక్ (Shuttlecock) ను తీసేందుకు ప్రయత్నించగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
వసంత్ నగర్ ఏరియాకి చెందిన ప్రేమ్ చరణ్ (14) తన ఇంటి ప్రాంగణంలో ఫ్రెండ్స్ తో కలిసి షటిల్ ఆడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో షటిల్ కాక్ వెళ్లి సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. దీంతో ప్రేమ్ చరణ్ (Prem Charan) ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిన కాక్ ని బ్యాట్ తో తీసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్ (Current shock) కి గురయ్యాడు. ఆస్పత్రికి తరలించేలోపే అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
ప్రేమ్ చరణ్ కేపీహెచ్‌బీ (KPHB) లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నాడు. చేతికందొస్తున్న కొడుకును కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రేమ్ చరణ్ మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.