బెట్టింగ్ యాప్స్ కేసులో విచార‌ణ‌కు రానా

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : సినీ నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్​ యాప్​లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన నేడు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. బెట్టింగ్​ యాప్​ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై నటుడిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

బెట్టింగ్​ యాప్​ కేసులో గతంలో విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా రానా కొంత సమయం కోరారు. ఇందుకు దర్యాప్తు సంస్థ అంగీకరించి, ఆగస్టు 11న హాజరుకావాలని సమన్లు ఇచ్చింది. దాంతో నేడు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (Enforcement Directorate) ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ(Prakash Raj, Vijay Devarakonda) ను ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. ప్రకాశ్‌ రాజ్‌ను 6 గంటలు, విజయ్‌ దేవరకొండను 4 గంటల పాటు విచారించారు. ఇక ఈ నెల 13న విచారణకు రావాలని మంచు లక్ష్మీ(Manchu Lakshmi)కి ఈడీ అధికారులు(ED Officers) నోటీసులు(Notices) ఇచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply