కర్నూలు బ్యూరో, ఆగస్టు 11 (ఆంధ్రప్రభ టీం) : కర్నూలు (Kurnool) జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే తుంగభద్ర జలాశయం (Tungabhadra Dam) నిండుకోవడంతో.. కనిష్ట స్థాయిలో నీటి నిలువలు ఉంచుకొని… దిగువ‌కు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు వేదవతి, హగరి నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇదే సమయంలో స్థానికంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు కూడా నిండుకున్నాయి. వీటిమూలంగా పలుచోట్ల ప్రధాన రహదారుల వంతెనలపై వరద నీరు కారణంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ముఖ్యంగా దేవనకొండ ప్రధాన రహదారి నీట మునిగి వాహనాల రాకపోకలు బంద్ కాగా, ఇక కౌతాళం (Kautalam) మండలంలోని దమ్మలదిన్నె గ్రామం లో వర్షం మూలంగా ఓ ఇల్లు నేలకొలింది. ఇక జొన్నగిరి (Jonnagiri) పరిధిలో వర్షమూలంగా చెరువు నిండుతుంది. గిరిగెట్ల – అమీనాబాద్ (Girigetla – Aminabad) గ్రామాల మధ్య ఉండే బ్రిడ్జిపై వరద నీరు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే రోల్లపాడు తండాకు మంచినీరు సప్లై చేస్తున్న పైపులైను నీటిలో కొట్టుకుపోయింది. ఇక ఎర్రగుడి గ్రామంలో రాఘవేంద్ర (Raghavendra) అనే రైతు వేరుశనగ పంటను పొలంలో ఆరబెట్టగా వర్షానికి కొట్టుకపోవడం జరిగింది. నందవరం మండలం (Nandavaram Mandal) లో పంట పొలాలు నీటి మునిగి రైతులకు జీవ నష్టం వాటిల్లింది.

కౌతాలం మండలంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వర్షం మూలంగా పలుచోట్ల పంట పొలాలు (Crop fields) నీట మునిగాయి. వీటివల్ల తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు (Farmers) వాపోతున్నారు. ఇక ఇదే సమయంలో సుంకేసుల పొంగిపొర్లుతుంది. తుంగభద్ర డ్యాం ఎగువ భారీ వర్షాలు నమోదవడంతో.. డ్యామ్ కి చెందిన గేట్లను ఎత్తి దిగువకు 26140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక కర్నూలు (Kurnool) జిల్లాలో స్థానికంగా కురిసిన వర్షాలతో వేదవతి, మంత్రాలయం వద్ద నది తీవ్రస్థాయిలో ప్రవహిస్తుంది. ఇక్కడ 72000 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.

వీటి మూలంగా సుంకేసుల బ్యారేజ్ కు భారీగా వరద నీరు చేరుకుంటుంది. ప్రస్తుతం సుంకేసుల బ్యారేజ్ (Sunkesula Barrage) కు 70000 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుంది. దిగువ వాగుల ప్రభావంతో ప్రస్తుతం బ్యారేజ్ కి 90 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు ఇరిగేషన్ ఇంజనీర్లు వెల్లడించారు. ఇంకా సుంకేసుల బ్యారేజ్ నుంచి వచ్చిన నీరు వచ్చినట్లుగా దిగువ నదిలోకి విడుదలవుతుంది. దీంతో తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతూ.. శ్రీశైల జలాశయంకు వరద నీరు చేరుతుంది. నంద్యాల జిల్లా గడివేముల మండలంలో కూడా.. వర్షం మూలంగా వంట పొలాలు దెబ్బతిన్నాయి. మోకాలు లోతున నీళ్లు నిలవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

Leave a Reply