• వన్డే వరల్డ్ కప్-2027 పోటీలో.. కోహ్లి, రోహిత్ ల‌కు బీసీసీఐ కండీషన్..!
  • ఆస్ట్రేలియాతో వన్డే సిరీసే వారికి చివరిదా..?
  • ఆసిస్ టూరు తర్వాత వీడ్కోలు..!


అక్టోబర్ లో వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో చివరిసారిగా వన్డేలు ఆడిన రోహిత్, కోహ్లి ఆసిస్ సిరీస్ (Assis series)లోతిరిగి వన్డేల్లోకి పునరాగమనం చేయనున్నారు. అయితే, ఈ సిరీసే వారికి చివరిదయ్యే చాన్స్ లేకపోలేదు. దానికి కారణంగా బీసీసీఐ కండీషనే. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీసు ముందు కోహ్లి, రోహిత్ అనూహ్యంగా సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

ఆ సిరీస్ లో పాల్గొనాలని వారు భావించారు. కానీ, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎంపిక చేయడం కష్టమేనని బీసీసీఐ వర్గాలు తెలియజేయడంతోనే వారు టెస్టులకు వీడ్కోలు పలికినట్టు సమాచారం. ఇప్పుడు కూడా రోహిత్, కోహ్లి వారంతంట వారే వన్డేల నుంచి తప్పుకోవాలనే బీసీసీఐ విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) ఆడాలనే కండిషన్ పెట్టి ఉండొచ్చు. ఆ షరత్ కు వారు అంగీకరిస్తారా..?.. నిరాకరిస్తారా..? చూడాలి. ప్రస్తుతం వారు దేశవాళీలో ఆడటం డౌటే. కాబట్టి, ఆస్ట్రేలియా పర్యటనతో తర్వాత కోహ్లి, రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చాలా కాలంగా భారత క్రికెట్ కు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ ( Rohit Sharma) మూలస్తంభాలుగా ఉన్నారు. కెరీర్ చరమాంకంలో ఉన్న వీరు ఇప్పటికే టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేశారు. ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నారు. వన్డే వరల్డ్ కప్-2027 (ODI World Cup-2027) ఆడి కెరీర్ ను ముగించాలని ఈ ఇద్దరు దిగ్గజాలు భావిస్తున్నారు. అప్పటికీ ఇద్దరికి 40 ఏళ్లు వస్తాయి. అప్పటి వరకు విరాట్, రోహిత్ నిలకడగా రాణించడమే కాకుండా.. ఫిట్నెస్ (Fitness) ను కాపాడుకోవాలి. అది వారికి పెద్ద సవాలే. ఈ క్రమంలోనే వీరి భవితవ్యంపై రోజుకో వార్త బయటకొస్తోంది. వన్డే వరల్డ్ కప్- 2027 జట్టులో వీరిద్దరికి స్థానాలు గ్యారెంటీ లేవని ఓ ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది.

బీసీసీఐ (BCCI) వరల్డ్ కప్ ప్రణాళికల్లో కోహ్లి, రోహిత్లు లేరని టీమ్ మేనేజ్ మెంట్ వర్గాలు తెలిపినట్టు పేర్కొంది. అలాగే, ఈ దిగ్గజాల ముందు బీసీసీఐ ఓ కండీషన్ పెట్టిందట. వన్డే వరల్డ్ కప్ (ODI World Cup) పోటీలో ఉండాలంటే వారిద్దరూ దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడాలనే షరత్ పెట్టినట్టు సమాచారం. ఆ టోర్నీ డిసెంబర్ లో జరగనుంది. బీసీసీఐ కండీషన్ ను కోహ్లి, రోహిత్ నిరాకరిస్తే ప్రపంచకప్ మార్గాలు మూసుకుపోయినట్లేనని సదరు మీడియా సంస్థ తెలిపింది. జాతీయ జట్టు బాధ్యతలు లేనప్పుడు దేశవాళీలో ఆడాలని బీసీసీఐ గతంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు రోహిత్, కోహ్లి బుమ్రాలకు మినహాయింపు ఇవ్వడం గమనార్హం.

Leave a Reply