మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ “వార్ 2” మూవీ.. గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకతో దుమ్ము రేపింది. మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటంతో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. YRF స్పై యూనివర్స్ నుంచి వస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది.
ఫ్యాన్స్ హంగామా
ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్ కోసం వేదిక వద్ద భారీ కటౌట్స్, లైటింగ్, స్పెషల్ సెట్స్ ఏర్పాటు చేశారు. ఈవెంట్‌కు ముందే వేలాది అభిమానులు అక్కడికి తరలి వచ్చి హర్షధ్వానాలు చేశారు. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్టేజ్‌పై కనిపించగానే ఫ్యాన్స్ అరుపులు ఆకాశాన్ని తాకాయి.
