తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న ఏనుగుల దాడుల నివారణ కోసం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి (Forest Minister, AP) కూడా అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కృషి ఫలించింది. ఆయన చొరవతో రెండునెలల క్రితం జిల్లాకు తీసుకువచ్చిన కుంకీ ఏనుగులతో నిర్వహించిన తొలి ఆపరేషన్ విజయవంతమైంది. అటవీ అధికారుల సమాచారం ప్రకారం చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో రెండురోజుల క్రితం నుంచి జయంత్, వినాయక్, కృష్ణ అనే కుంకీ ఏనుగుల గస్తీ ఏర్పాట్లు చేశారు. టేకులమంద ప్రాంతంలో దాదాపు 10 అడవి ఏనుగుల గుంపు తిరుగుతున్నట్టు తెలియడంతో అక్కడ కుంకీ ఆపరేషన్ (Kunki Operation)చేపట్టారు.

అటవీ సిబ్బందితో కలిసి  ప్రత్యేక శిక్షకుల నేతృత్వంలో శని, ఆదివారాల్లో నిర్వహించిన ఆపరేషన్ లో  కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను పంట పొలాల(Green Fields) వైపు రాకుండా అడ్డుకుని అడవుల వైపునకు తరిమి వేయగలిగాయి. దాదాపు నాలుగైదు  గంటలకు పైగా కొనసాగిన ఈ ఆపరేషన్ లో పెద్ద అడవి ఏనుగులను అడవుల  వైపు తరిమివేయడంలో విజయవంతం(Success) అయిన కుంకీ ఏనుగులు ఆ గుంపులో ఉన్న గున్న (చిన్న) ఏనుగు (Elephant) విషయంలో కొంత ఇబ్బంది పడ్డాయని, చివరకు అన్ని  ఏనుగులను అడవుల వైపు మళ్లించడం తో ఆపరేషన్ (Operation Success) విజయవంతం అయిందని అటవీ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల అక్కడి సమీప గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply