IND vs ENG | సిరాజ్ సెల‌బ్రేష‌న్స్ తో ముగిసిన‌ మూడో రోజు..

ఓవల్ టెస్టులో మూడో రోజు చివర్లో భారత్ దూకుడు చూపించింది. మొహమ్మద్ సిరాజ్ తన స్పెషల్ యార్కర్‌తో జాక్ క్రాలీని క్లీన్ బౌల్డ్ చేసి మూడో రోజు ఆటకు పటిష్ట ముగింపు ఇచ్చాడు. అనంతరం సిరాజ్ చేసిన ప్రత్యేక సెలబ్రేషన్ స్టేడియం నిండా శబ్దాల వెల్లువను తెచ్చింది. ఆ వికెట్‌తో మ్యాచ్ మోమెంటమ్ పూర్తిగా భారత్ వైపుకి జారింది.

ఈ రోజు ఆట ఆకాశ్ దీప్ – యశస్వి జైస్వాల్ బ్యాటింగ్‌తో ప్రారంభమైంది. ఆకాశ్ టెస్ట్ కెరీర్‌లో తన తొలి హాఫ్ సెంచరీ (66) నమోదు చేయగా, జైస్వాల్ మరో అద్భుత శతకం (118)తో మెరిశాడు. ఈ సిరీస్‌ను శతకంతో ప్రారంభించిన ఈ యువ ఓపెనర్, అదే తీరులో శతకంతో ముగించడం విశేషం.

కరుణ్ నాయర్(17) , ధ్రువ్ జురేల్(34) మంచి ఆరంభం ఇచ్చినా, భారీ స్కోర్‌గా మలుచుకోలేకపోయారు. కానీ రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) తమ అర్ధశతకాలతో స్కోరు బోర్డును గణనీయంగా ముందుకు నడిపించాడు.

ఆఖరికి భారత్ ఇన్నింగ్స్ 396 పరుగులు వద్ద ముగిసింది. దీంతో 374 పరుగుల ఇంగ్లండ్ ఛేజింగ్ కు దిగింది. బౌలింగ్‌లో జోష్ టంగ్ ఐదు వికెట్లు తీయగా, గస్ అట్కిన్సన్ మూడు, జామీ ఓవర్టన్ రెండు వికెట్లు సాధించారు.

చివరి ఇన్నింగ్స్ ను ఇంగ్లండ్ బలంగా ప్రారంభించింది. బెన్ డకెట్జాక్ క్రాలీ మళ్లీ ఒక అర్ధశతక భాగస్వామ్యాన్ని నమోదు చేస్తూ భారత్‌పై ఒత్తిడి తెచ్చారు. కానీ, మూడో రోజు చివరి ఓవర్‌లో సిరాజ్ వేసిన యార్కర్‌కి, క్రాలీ వికెట్ ఎగిరిపోయింది.

దీంతో ఇంగ్లండ్ 50/1 వద్ద డే 3 ముగించగా, ఇంకా 324 పరుగులు చేయాల్సి ఉంది, 9 వికెట్లు మిగిలి ఉన్నాయి. ఆట దశలన్నీ భారత్ చేతుల్లో ఉన్న నేపథ్యంలో, నాలుగో రోజు మ్యాచ్ ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply