ఇంగ్లాండ్ – భారత్ మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ డే 5 తొలి సెషన్ ముగిసింది. భారత్ 26 ఓవర్లలో కేవలం 49 పరుగులు మాత్రమే చేసి రెండు కీలక వికెట్లు కోల్పోయింది. లంచ్ సమయానికి భారత్ స్కోరు 223/4గా ఉంది. ఇంకా ఇంగ్లాండ్ కంటే 88 పరుగుల వెనుకంజలో ఉంది.
రోజు తొలి సెషన్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ – కేఎల్ రాహుల్ తమ ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. లియామ్ డాసన్, బెన్ స్టోక్స్‌తో ఇంగ్లాండ్ బౌలింగ్‌ను మొదలు పెట్టింది. 20 బంతుల్లోనే స్టోక్స్ రాహుల్‌ను 90 పరుగుల వద్ద LBW ద్వారా ఔట్ చేశాడు. ఈ జోడీ 188 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.
వాషింగ్టన్ సుందర్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రాగా.. తొలి గంటలో కేవలం 19 పరుగులే వచ్చినా, గిల్ మాత్రం బలమైన రక్షణతో ఆడుతూ తన శతకాన్ని పూర్తి చేశాడు – ఈ సిరీస్‌లో నాల్గవ సెంచరీ.
క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్ చేతిలోని రెండవ న్యూబాల్ ను భారత్ జాగ్రత్తగా ఎదుర్కొంది. అయితే ఆర్చర్ ఓవర్లో గిల్ (103) పరుగుల వద్ద వెనుదిరిగాడు.
జడేజా మొదటి బంతికే రూట్ చేతిలో క్యాచ్ ఇవ్వగా అది డ్రాప్ అయ్యింది. దీంతో సుందర్ (21) – జడేజా (0) లంచ్ వరకు క్రీజులో నిలిచారు.