IND vs ENG | ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ ముందు భారీ టార్గెట్ !
కటక్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ జట్టు టీమిండియాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్… 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది.
ఈ ఇన్నింగ్స్ లో బెన్ డకెట్ (65), జో రూట్ (69), లియామ్ లివింగ్ స్టన్ (41), కెప్టెన్ జోస్ బట్లర్ (34), హ్యారీ బ్రూక్ (31), ఫిల్ సాల్ట్ (26) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 3, మహ్మద్ షమీ 1, హర్షిత్ రాణా 1, హార్దిక్ పాండ్యా 1, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు.
దీంతో భారత జట్టు 305 పరుగుల విజయ లక్ష్యంతో చేజింగ్ కు దిగింది.