Delhi | పదేళ్ల కష్టాలకు విముక్తి… మీ రుణుం తీర్చుకుంటాం : ప్రధాని మోదీ
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం
- బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవవేడకలు
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రదాని మోదీతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా కూడా వచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులకు మోదీ అభినందనలు తెలిపారు. పదేళ్ల కష్టాలు, సమస్యలనుంచి ఢిల్లీకి విముక్తి అభించిందని అన్నారు.
కాగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందన్నారు. ఆప్ నుంచి విముక్తి పొందిన ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉన్నారని, బీజేపీ కార్యకర్తల్లోనూ ఉత్సాహం పెరిగిందని అన్నారు. పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
మా పార్టీపై నమ్మకంతో ఢిల్లీలో కాషాయ జెండాను ఎగురవేసినందుకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. వికాసిత్ రాజధానిగా చేసేందుకు అవకాశం ఇచ్చారు.. ఈ చారిత్రాత్మక విజయాన్ని అందించినందుకు ఢిల్లీని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని మోదీ అన్నారు.