సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (subhanshu sukla) అంతరిక్ష ప్రయాణం (space tour )ముగిసింది. దాదాపు 18 రోజులపాటూ ఐఎస్‌ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన శుభాన్షు బృందం భూమికి (earth ) సురక్షితంగా తిరిగివచ్చారు.. వీరు ప్రయాణించే స్పేస్‌క్రాఫ్ట్ (space craft ) సోమవారం మధ్యాహ్నం 4.45 గంటలకు ఐఎస్‌ఎస్‌తో (ISS) అన్‌డాకింగ్ ప్రక్రియ పూర్తిచేసుకుంది. డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక దాదాపు 22 గంటలపాటు అంతరిక్షంలో ప్రయాణించి మంగళవారం (tuesday ) మధ్యాహ్నం 3 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫ్లోరిడాలోని (florida ) సముద్ర జలాల్లో (sea ) దిగింది.

ఏడు రోజులు క్వారంటైన్..
వ్యోమగాములు భూమికి చేరిన తర్వాత శుభాన్షుతో సహా మిగిలిన వారిని ఏడు రోజులపాటూ క్వారంటైన్‌కు తరలించారు. ఇస్రో జీరో గ్రావిటీలో గడిపి వచ్చిన వ్యోమగాముల శరీరాలు భూ వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా క్వారంటైన్ లో ఉంచుతున్నారు. . ఇస్రోకు చెందిన ఫ్లైట్ సర్జన్లు వారం రోజుల పాటూ వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షించిన అనంతరం వారిని బయటకు తీసుకువస్తారు.
శుభాన్షు రికార్డు..
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా శుభాన్షు శుక్లాతోపాటు నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామిగా శుభాన్షు శుక్లా రికార్డు క్రియేట్ చేశారు. 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్లి వస్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టించారు. ఐఎస్‌ఎస్‌లోకి వెళ్తున్న తొలి భారతీయుడు కూడా ఇతనే.
కోట్లాది మందికి శుభాంశు శుక్లా ప్రేరణ – మోదీ
యాక్సియం-4 మిషన్ విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములతో కూడిన వ్యోమనౌక కాలిఫోర్నియా సమీపంలోని సముద్రంలో దిగింది. ఈ సందర్భంగా మోదీ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను స్వాగతించే భారత ప్రజల్లో తాను కూడా ఒకడినని ఆయన పేర్కొన్నారు. శుభాంశు శుక్లా తన అంకితభావం, ధైర్యం, మార్గదర్శక స్ఫూర్తి ద్వారా కోట్లాది మందికి ప్రేరణ ఇచ్చారని ప్రశంసించారు. ఇది భారత మానవ సహిత అంతరిక్ష మిషన్ గగన్‌యాన్ దిశగా మరో ముందడుగు అని ఆయన అభివర్ణించారు.