IND vs ENG – Lord’s Test | ఉత్కంఠంగా ముగిసిన నాలుగో రోజు !

లార్డ్స్ వేదిక‌గా భార‌త్ – ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ నాల్గో రోజు ఉత్కంఠతో ముగిసింది. ఇంగ్లాండ్ ను 192 ప‌రుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా.. నాల్గో రోజు ముగిసే సిరికి భారత్ 58/4 వద్ద నిలిచింది.

చిన్న టార్గెట్ అయినా భారత్ ఇన్నింగ్స్ ఘోరంగా ప్రారంభమైంది. జోఫ్రా ఆర్చర్ తన మొదటి ఓవర్‌లోనే యశస్వి జైస్వాల్‌ని డక్‌కి అవుట్ చేశాడు. కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను క్రిస్ వోక్స్ మిస్ చేయ‌గా.. ఆ తర్వాత అతను బలంగా నిలిచి చివరి వరకు ఆడాడు. కరుణ్ నాయర్ (14), శుభ‌మ‌న్ గిల్ (6) కార్స్ బౌలింగ్ లో ఎల్బీడ‌బ్ల్యూ గా వెనుదిరిగారు.

భారత్ తీవ్ర క‌ష్టాల్లో పడటంతో, ఆకాష్ దీప్ ను నైట్ వాచ్ మన్ గా పంపారు. అయితే, ఆకాష్ దీప్ (1) ను స్టోక్స్ అవుట్ చేశాడు. దీంతో భారత్ 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ (33) క్రీజులో ఉన్నాడు.

ఈ మ్యాచ్ గెలవాలంటే భారత్ ఇంకా 135 పరుగులు చేయాలి.. మ‌రోవైపు ఇంగ్లాండ్ కు ఇంకా 6 వికెట్లు అవసరం. దీంతో లార్డ్స్ లో జరిగే చివరి రోజు ఆట‌ రసవత్తరంగా సాగుతుంది.

అంతకు ముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 192 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొహమ్మద్ సిరాజ్ తొలితరం లోనే బెన్ డకెట్‌ ను అవుట్ చేసి భారత్‌కి అదును అందించాడు. ఆ తర్వాత అలాంటి అందమైన ఇన్‌డకర్ తో ఒల్లీ పోప్ ను ఎల్బీడబ్ల్యూగా పడగొట్టాడు

అంతకుముందు, ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 192 పరుగులకే ఆలౌట్ అయింది. మహమ్మద్ సిరాజ్ తొలి ఓవర్లోనే బెన్ డకెట్‌ను అవుట్ చేయడం ద్వారా భారతదేశానికి ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత ఓలీ పోప్‌ను సైతం ఎల్‌బిడబ్ల్యుగా అవుట్ చేశాడు.

నితీష్ కుమార్ రెడ్డి తన బలాన్ని ప్రదర్శించి జాక్ క్రాలీని అవుట్ చేశాడు. ఆకాష్ దీప్ బౌలింగ్ లో హ్యారీ బ్రూక్ బౌల్డ్ కావ‌డంతో ఇంగ్లాండ్ స్కోరు 87/4కి పరిమితమైంది.

ఆ క్ర‌మంలో జో రూట్ (40) – బెన్ స్టోక్స్ (33) లు ఐదో వికెట్‌కి 67 పరుగులు జోడించి జట్టును నిలబెట్టారు. కానీ డ్రింక్స్‌ తర్వాత వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా మళ్లీ మ్యాచ్‌ను భారత్ వైపుకు తిప్పాడు. రూట్‌, స్మిత్ ని ఔట్ చేసి ఇంగ్లాండ్ కు షాకిచ్చాడు. దీంతో టీ విరామానికి ఇంగ్లండ్ 175/6 వద్దకు చేరింది.

టీ బ్రే తర్వాత సుందర్ కూడా తన మ్యాజిక్ కొనసాగిస్తూ ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్‌ను బౌల్డ్ చేశాడు. బుమ్రా దూకుడు చూపి కార్స్, వోక్స్‌ ను త్వరగా పెవిలియన్‌కి పంపగా.. చివరగా సుందర్, బషీర్ ను బోల్తా కొట్టించి నాలుగు వికెట్లతో తన స్పెల్‌ను ముగించాడు.

Leave a Reply