ACB attack | ఏసీబీకి చిక్కిన పంచాయితీ రాజ్ ఏఈ

రూ.90వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత


కాల్వ శ్రీరాంపూర్, ఆంధ్రప్రభ : లంచగొండి అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. శనివారం పెద్దపల్లి (Peddapally) జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం వద్ద పంచాయతీరాజ్ ఏఈ (Panchayat Raj AE) జగదీష్ 90వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డిఎస్పి (Karimnagar ACB DSP) విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు.

కాల్వ శ్రీరాంపూర్ పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రాజు నుండి సీసీ రోడ్డు బిల్లు మంజూరు కోసం 90వేల రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈసందర్భంగా డిఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ… ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు.

Leave a Reply