AP| 9 గంట‌లపాటు విచార‌ణ‌.. ఆవెంట‌నే ఆర్జీవీకి మ‌రో షాక్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరో షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్ కేసులో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆయనను దాదాపు 9 గంటల విచారించారు. అయితే విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆర్జీవీకి గుంటూరు సీఐడీ పోలీసులు పెద్ద షాక్ ఇచ్చారు.

అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సంబంధించి గుంటూరు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 10న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

9 గంటల్లో 50 ప్రశ్నలు..

కాగా, ఫోటో మార్ఫింగ్ కేసులో గుంటూరు పోలీసులు జరిపిన విచారణలో వ‌ర్మ‌పై మొత్తం 50 ప్రశ్నలు సంధించారు. అందులో 44 ప్రశ్నలకు రామ్ గోపాల్ వర్మ సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ వాంగ్మూలాలను నమోదు చేసుకున్న పోలీసులు మరోసారి విచారణకు రావాలని సూచించారు. దీంతో ఆయ‌న రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో పోలీస్ స్టేష‌న్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో గుంటూరు సీఐడీ పోలీసులు ఆర్జీవీకి మ‌రో ఘ‌ల‌క్ ఇచ్చారు.

Leave a Reply