Breakfast Menu | ఇందిర‌మ్మ క్యాంటీన్లలో టిఫిన్ మెనూ ఇదే..

హైద‌రాబాద్ – తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ క్యాంటీన్లలో(Indiramma canteen ) రూ.5కే అల్పాహారాన్ని (breakfast ) అందించే పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇవ్వబోయే బ్రేక్‌ఫాస్ట్ మెనూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ నిర్ణయం మేరకు ప్రజల నుంచి ఒక్కో టిఫిన్‌కు కేవలం రూ.5 మాత్రమే(Only five rupees ) వసూలు చేయనుంది. మిగతా రూ.14 ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఒక టిఫిన్‌కు మొత్తం ఖర్చు రూ.19గా అంచనా వేయగా, ప్రజలపై ఆర్ధిక భారం పడకుండా దీన్ని అమలు చేయాలని భావిస్తోంది.

జిహెచ్ ఎంసి రూపొందించిన మెనూను హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు. ఆరోగ్యకరంగా ఉండేలా మిల్లెట్ ఫుడ్‌ను ప్రాధాన్యతనిస్తూ రోజుకో రకం అల్పాహారాన్ని అందించనున్నారు. మెనూలో 6 రోజుల అల్పాహారం ఇలా ఉండబోతుంది:

Day 1: మిల్లెట్ ఇడ్లీ (3), సాంబార్, చట్నీ/పొడి
Day 2: మిల్లెట్ ఉప్మా, సాంబార్, మిక్స్ చట్నీ
Day 3: పొంగల్, సాంబార్, చట్నీ
Day 4: ఇడ్లీ (3), సాంబార్, చట్నీ
Day 5: పొంగల్, సాంబార్, చట్నీ
Day 6: పూరీ (3), ఆలూ కూర్మా

Leave a Reply