Siddipet | ఈవీఎం గోదాంను ప‌రిశీలించిన అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్

సిద్దిపేట్ : రాష్ట్రంలోని అన్ని ఈవీఎం గోదాంల త‌నిఖీలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ నుండి అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (Additional Chief Electoral Officer), ఈవీఎం నోడల్ ఆఫీసర్ (EVM Nodal Officer) హరిసింగ్, ఈవీఎం కన్సల్టెన్సీ ఆఫీసర్ (EVM Consultancy Officer) ప్రసాద్ కలెక్టరేట్ పక్కన గల ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ లతో కలిసి పరిశీలించారు.

లాగ్ బుక్ ను వెరిఫై చేసి అందులో సంతకం చేశారు. సెక్యూరిటీ, సీసీ కెమెరా మానిటరింగ్ రూమ్ పనితీరును పరిశీలించారు. ఈవీఎం గోదాం చుట్టూ 24/7 గట్టి బందోబస్తుతో విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు తెలిపారు. రెవెన్యూ అధికారులు తర‌చూ పర్యవేక్షణ చెయ్యాలని సూచించారు.

Leave a Reply