- అప్రమత్తమైన డ్రైవర్
- అమీన్‌పూర్ పరిధిలో ఘటన
హైదరాబాద్, ఆంధ్రప్రభ : అమీన్‌పూర్ (Ameenpur) మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట (Kishta Reddypet) లో పెను ప్రమాదం తప్పింది. విధ్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు (School bus) లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్, సహాయకుడు అప్రమత్తమవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
గురువారం ఉదయం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (Delhi Public School) కు చెందిన బస్సులోకి కిష్టారెడ్డిపేట వద్ద విద్యార్థులు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. గమనించిన డ్రైవర్ (Driver) పిల్లలను వెంటనే బయటకు దింపేశారు. మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.