పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే జీఎస్సార్
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి (Bhupalpalli) నియోజకవర్గం మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) నాయకులు గురువారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కటంగూరి రాంనరసింహారెడ్డి (Ramnarasiinha Reddy) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (MLA Gandra Satyanarayana Rao) కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
కాగా పార్టీలో చేరిన వారిలో దూడపాక కొమురయ్య, సరిగొమ్ముల సమ్మయ్య, సరిగొమ్ముల రాజేశం, గడ్డం సారయ్య ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ చేరినట్లు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భూపాలపల్లిలో నియోజకవర్గంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.