AP | డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన బీజేపీ నూతన అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ !

మంగళగిరి : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఈరోజు (బుధవారం) సాయంత్రం బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన పి.వి.ఎన్. మాధవ్, పవన్ కళ్యాణ్‌ను శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక‌ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ భేటీ ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఇరువురు నేతలు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, రాబోయే కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం.

Leave a Reply