కాలిఫోర్నియా – ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్, తన నాయకత్వ బృందంలో కీలక మార్పులను ప్రకటించింది. అందులో భాగంగా కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా భారత సంతతికి చెందిన సబిహ్ ఖాన్ (Indian Origin Sabih Khan) నియమితులయ్యారు. అదే సమయంలో, ఆపిల్ సిఈవో టిమ్ కుక్ (ceo tim cook ) కంపెనీ డిజైన్ బృందానికి (design team ) నాయకత్వం వహించనున్నారు. ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ కొత్త నియమాకాలను కంపెనీ ప్రకటించింది.
కొత్త మార్పులు (new changes )
కంపెనీ భవిష్యత్తు వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ మార్పులు చేస్తున్నారు. జెఫ్ విలియమ్స్, 2019లో ఆపిల్ ఐకానిక్ డిజైనర్ జానీ ఐవ్ నిష్క్రమణ తర్వాత, డిజైన్ బృందాన్ని పర్యవేక్షించారు. ఆయన నాయకత్వంలో ఆపిల్ వాచ్, ఆరోగ్య సంబంధిత ప్రాజెక్టులు, ఉత్పత్తి డిజైన్‌లో ఎంతో పురోగతి సాధించారు. అయితే, విలియమ్స్ తన పదవీ విరమణ వరకు బాధ్యతలను కొనసాగిస్తారు.
ఆపిల్ కొత్త సీఓఓ
భారత సంతతికి చెందిన సబిహ్ ఖాన్ ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్‌గా గతంలో అనేక కీలక బాధ్యతలను నిర్వహించారు. ఆపిల్ సప్లై చైన్, ఉత్పత్తి తయారీ, గ్లోబల్ ఆపరేషన్స్‌ను సమర్థవంతంగా నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు, కొత్త సివోవో గా, ఖాన్ ఆపిల్ ఆపరేషనల్ సామార్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, కంపెనీ గ్లోబల్ విస్తరణ, ఉత్పత్తి నాణ్యతను కొనసాగించే బాధ్యతను స్వీకరిస్తారు.
డిజైన్ బృందానికి నాయకత్వం
టిమ్ కుక్, ఆపిల్ సిఈఓగా, కంపెనీ విజన్, ఆవిష్కరణలకు దిశానిర్దేశం చేస్తారు. డిజైన్ బృందానికి నేరుగా నాయకత్వం వహించడం ద్వారా, ఆపిల్ ఉత్పత్తుల డిజైన్‌ను మరింత బలోపేతం చేయనున్నారు. ఆపిల్ ఐకానిక్ డిజైన్‌లు, వినియోగదారు అనుభవం, టెక్నాలజీ పరంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కుక్ నాయకత్వంలో ఈ బృందం కొత్త ఉత్పత్తులు, సాంకేతికతలను మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంది.
భవిష్యత్తు వ్యూహం
ఈ నాయకత్వ మార్పులు ఆపిల్ భవిష్యత్తు లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సబిహ్ ఖాన్ నియామకం ఆపిల్ ఆపరేషనల్ బలాన్ని మరింత బలోపేతం చేయనుంది. అదే సమయంలో టిమ్ కుక్ డిజైన్ బృందం నాయకత్వం కంపెనీ ఆవిష్కరణలకు కొత్త ఊపును ఇస్తుంది. ఈ మార్పులు, ఆపిల్ ఉత్పత్తులు, సేవలను మరింత వినూత్నంగా మార్చనున్నాయి.