జన్నారం, జులై 8 (ఆంధ్రప్రభ): పల్లెల్లోని సమస్యలు తెలుసుకుని అంచెలంచెలుగా తీరుస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur MLA) వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం (Jannaram) మండలంలోని పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీ, జన్నారం గ్రామంలో పొద్దు పొడుపు- బొజ్జన్న అడుగు (మార్నింగ్ వాక్) కార్యక్రమం మంగళవారం ఉదయం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లోని వాడల్లో కాలినడకన తిరుగుతూ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి ఆ సమస్యలను పరిష్కరిస్తానన్నారు.
పల్లెల అభివృద్దే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి (Government effort) చేస్తోందని, గ్రామాలను అన్ని విధాలుగా సుందరంగా తీర్చిదిద్దేందుకు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు,త్రాగు నీరు అందించేందుకు బోర్లు వేశామని తెలిపారు.ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇచ్చామని,ఇండ్లు రాని పేదలకు 2వ విడతలో ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని ఆయన తెలిపారు.పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన చెప్పారు.
తన ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలోని అన్ని పల్లెల్లో సమస్యలు లేకుండా చూస్తానని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్, వైస్ చైర్మన్లు దుర్గం లక్ష్మీనారాయణ,ఫసిహుల్ల, గ్రామ కార్యదర్శి రేగొండ రాహుల్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ముసఫర్,నేతలు మోహన్ రెడ్డి,ఇసాక్, నందునాయక్,ఎస్పీ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు దుమల్ల రమేష్,ఇందయ్య, సోహేల్ షా,సుధాకర్ నాయక్,సుధీర్ కుమార్,రాజన్న యాదవ్, గంగన్న యాదవ్, హజర్, రాజేష్, లక్ష్మణ్ నేతలు తదితరులు పాల్గొన్నారు.