Peddapally | సోలార్ పవర్ ప్లాంట్ మాకొద్దు.. రాఘవపూర్ గ్రామస్థుల ఆందోళన

పెద్దపల్లి రూరల్, జులై 7(ఆంధ్రప్రభ): పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో అప్పన్నపేట సహకార సొసైటీ (Cooperative Society) ఆధ్వర్యంలో పీఎం కుసుం ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం సర్వే నం 1072 లో 4 ఎకరాల భూమి కేటాయించి జిల్లా కలెక్టర్ ఆర్డర్ జారీ చేశారు. ఆ స్థలంలో ఏళ్ల నాటి నుండి స్మశాన వాటికగా వాడుకుంటామని, పెద్దల ఆనవాళ్లు పోతాయని, ఆ సోలార్ పవర్ ప్లాంట్ (Solar Power Plant) మాకు వద్దని మంగళవారం గ్రామస్థులు ఆందోళన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చొరవ చూపి సోలార్ పవర్ ప్లాంట్ ను వేరే స్థలంకు మార్చాలని డిమాండ్ చేశారు. లేనియెడల గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బిఆర్ఎస్ (Brs) మండల అధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, అరుకుటి రామస్వామి, తాడిచెట్టి శ్రీకాంత్, అంతగిరి కొమురయ్య, గాండ్ల సదయ్య, కల్లేపల్లి అశోక్, మోదుంపల్లి శ్రావణ్, ఏనుగుల సదయ్య, కొడపత్రి శ్రీనివాస్, ఒడ్నాల శంకర్, కోనేటి సదయ్య, దూలం సతీష్, అడప సతీష్, బొడ్డు శ్రీనివాస్, పలువురు గ్రామస్తులు ఉన్నారు.

Leave a Reply