Bhagavatgita | గీతాసారం (ఆడియోతో…) అధ్యాయం 6, శ్లోకం 15

గీతాసారం (ఆడియోతో…) అధ్యాయం 6, శ్లోకం 15

యుంజన్నేవం సదాత్మానం
యోగీ నియతమానస: |
శాంతిం నిర్వాణపరమాం
మత్సంస్థామధిగచ్ఛతి ||

తాత్పర్యము : దేహము, మనస్సు, కర్మలను ఈ విధముగా నిరంతరము నియమించుచు యోగియైనవాడు నియమిత మనస్సు కలవాడై భౌతికస్థితి నుండి విమించుట ద్వారా భగవద్రాజ్యమును పొందును.

భాష్యము : యోగాభ్యాసము యొక్క అంతిమ లక్ష్యము ఇచ్చట స్పష్టముగా వివరింపబడినది. అది ఆధ్యాత్మిక ఆకాశము లేదా భగవద్ధామమును చేరుటయని, భౌతిక భావనలను త్యజించుటయని తెలుపబడినది. అంతేకాని ఆరోగ్యము, భౌతిక సౌఖ్యము లేదా శూన్యములో కలయుట వంటివి లక్ష్యాలని తెలుపుట అమాయకులను మోసగించుటకు మాత్రమే. భగవంతుడు గోలోకములో ఉంటూ సర్వత్రా తన వివిధ శక్తుల ద్వారా విస్తరించి ఉంటాడు. కాబట్టి భగవం తుని సృష్టిలో శూన్యమునకు తావే లేదు. భగవంతుడైన కృష్ణుని పట్ల, విష్ణువు పట్ల సరైన అవగాహన లేనిదే ఎవరూ భగవద్ధామమును చేరలేరు. కాబట్టి భక్తుడే నిజ మైన యోగి కాగలడు, జన్మ మృత్యువును జయించి ఆధ్యాత్మిక ప్రపంచమును చేరగలడు. ఓం తత్సదితి శ్రీమద్భగవ ద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
కర్మసన్న్యాసయోగోనామ పంచమోధ్యాయ: ||

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి ాభక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Leave a Reply