ఎడ్జ్‌బాస్టన్ : ఇంగ్లాండ్ తమ ట్రేడ్‌మార్క్ బజ్‌బాల్ శైలిలో మూడవ రోజు ఉదయం సెషన్‌ను షురూ చేసి భారత్‌పై దాడికి దిగింది. హ్యారీ బ్రూక్ – జేమీ స్మిత్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించిన భారత్.. ఇప్పటికీ బలమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 249/5 (47 ఓవర్లు)తో ఉంది, భారత్ ఇంకా 338 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఈ ఉదయం జరిగిన ఆటలో ఇంగ్లాండ్ గట్టి పోరాటాన్ని చాటింది. హ్యారీ బ్రూక్ – జేమీ స్మిత్ ఆరో వికెట్‌కు అజేయంగా 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జంట కేవలం 40.3 ఓవర్లలోనే ఈ భాగస్వామ్యాన్ని సాధించి, భారత బౌలర్లపై ఒత్తిడి పెంచింది.
హ్యారీ బ్రూక్ 91 పరుగులతో (127 బంతులు) నిలకడగా ఆడుతూనే దంచేస్తున్నాడు. మరోవైపు, జేమీ స్మిత్ అద్భుతంగా రాణిస్తూ.. కేవలం 80 బంతుల్లోనే తన రెండో టెస్ట్ సెంచరీని సాధించాడు. 102 పరుగులు (82 బంతులు)తో క్రీజులో ఉన్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
ఈ సెషన్‌లో భారత బౌలర్లు కాస్త బలహీనంగా కనిపించినా.. మొత్తం మీద వారు ఇప్పటికీ బలమైన స్థితిలోనే ఉన్నారు. ఇంగ్లాండ్ ఇప్పటికీ ఫాలో-ఆన్ పరిధిలోనే ఉంది. ఫాలో-ఆన్‌ను నివారించడానికి ఇంకా 138 పరుగులు అవసరం. బ్రూక్-స్మిత్ జోడీని భారత బౌలర్లు బ్రేక్ చేయగలిగితే, భారతదేశం పూర్తి ఆధిపత్యాన్ని తిరిగి పొందవచ్చు.
తదుపరి సెషన్ మరింత ఉత్కంఠభరితంగా ఉండనుంది.