Business |స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

ముంబయి – దేశీయ స్టాక్ మార్కెట్లు (stock market ) వారాంతం ట్రేడింగ్‌ను (weekend trading ) లాభాలతో (profit) ముగించాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీస్తున్నప్పటికీ, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వెలువడుతున్న వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనైన సూచీలు, చివరికి ఫ్లాట్‌గా ముగిసి స్వల్ప లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ (sensex ) 193 పాయింట్ల లాభంతో 83,432 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, నిఫ్టీ (Nifty ) 55 పాయింట్లు పెరిగి 25,461 వద్ద ముగిసింది. 

ఆటోమొబైల్, టెలికాం, లోహ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. మరోవైపు బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ, రియల్టీ, మీడియా వంటి రంగాల సూచీలు 0.4 నుంచి 1 శాతం వరకు లాభపడ్డాయి.  నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యునిలీవర్ షేర్లు ప్రధానంగా లాభపడగా.. ట్రెంట్, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.

Leave a Reply