TG | కేసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా

  • అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశం

హైదరాబాద్‌: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆయన ఆసుపత్రిలోని వైద్యులతో మాట్లాడి కేసిఆర్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Leave a Reply