Cinema | పులిని వేటాడే బెబ్బులి వ‌చ్చేసింది.. హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ – వీడియోతో

గూస్ బంప్స్ తెప్పిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్
ప‌వ‌న్ యాక్ష‌న్ సీన్స్, డైలాగ్స్ అద‌ర‌వో
ఒక వైపు స‌నాత‌న ధ‌ర్మం.. మ‌రో పొలిటిక‌ల్ వార్ తో ట్రైల‌ర్
పండుగ చేసుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawar Star Pawan Kalyan ) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ చిత్రం ‘హరి హర వీర మల్లు: పార్ట్ 1-స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ (Hari hara veeramallu ) పై భారీ అంచనాలు నెలకొన్న విష‌యం తెలిసిందే. ఈ నెల‌ 24, న వ‌ర‌ల్డ్ వైడ్‌గా (world wide ) ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను (trailor ) విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ అంద‌ర్ని ఆక‌ట్టుకునేలా ఉంది..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ చారిత్రక చిత్రం హరి హర వీర మల్లు పార్ట్ 1: స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ ట్రైలర్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మూడున్నర నిమిషాల ట్రైలర్ ఇవాళ విడుదలవగా, అభిమానులు, ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్‌ను కలిగించింది.

ట్రైలర్ మొత్తం పవన్ కల్యాణ్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆసక్తికరంగా సాగుతుంది. వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. ఇక పవన్ కల్యాణ్ వీర మల్లు అనే అప్రతిహత యోధుడిగా కనిపించడం మెయిన్ హైలెట్. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ముఘల్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచే కథనంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాబీ డియోల్ ఔరంగజేబ్‌గా భయానకమైన పాత్రలో కనిపించగా, కోహినూర్ డైమండ్ కోసం జరుగుతున్న పోరాటం నేపథ్యంగా వీర మల్లు, ఔరంగజేబ్ ల మధ్య జరిగే యుద్ధమే చిత్రానికి హైలైట్.

యాక్షన్, విజువల్స్ బిగ్ స్క్రీన్ పై మరింత కిక్కిచ్చేలా ఉన్నాయి. పవన్ కల్యాణ్ లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. అన్నీ కలిపి ఒక పవర్‌ఫుల్ యోధుడిగా తెరపై నిండుగా కనిపిస్తారని తెలుస్తోంది. “ఆంధి వచ్చేసింది” అనే డైలాగ్ ఒక్కటే అభిమానుల్లో గూస్‌బంప్స్‌ కలిగిస్తోంది. “అందరూ నేను రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు… మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు” అనే మరో డైలాగ్ కూడా ఆయన రాజకీయమైన ప్రస్తుత స్థితిని ప్రతిబింబించడంతో ట్రైలర్‌కు మరింత బలాన్ని తెచ్చిపెట్టింది. అలాగే పులిని వేటాడే బెబ్బులి అనే డైలాగ్ కూడా పవర్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఉంది.

దర్శకుడు జ్యోతి క్రిష్ణ ఈ చారిత్రక చిత్రాన్ని మెగాస్కేల్‌లో రూపొందిస్తూ.. భారీ కాన్వాస్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో ప్రేక్షకులకు థియేట్రికల్ ఫీస్ట్ అందించనున్నట్లు అర్ధమవుతుంది. ట్రైలర్‌లో కనిపించిన యుద్ధ సన్నివేశాలు, సనాతన ధర్మంపై ప్రధాన పాత్ర పోరాటం సినిమాలోని ప్రధాన బలంగా నిలవనున్నాయి. ట్రైలర్‌ను బట్టి చూస్తే, జ్యోతి క్రిష్ణ విజన్‌ పూర్తిగా గ్రాండ్ స్క్రీన్ అనుభూతిని ఇవ్వాలన్నదే. పంచమిగా నటించిన నిధి అగర్వాల్ పాత్ర కూడా ట్రైలర్‌లో ఆకట్టుకుంటోంది. సినిమాటోగ్రాఫర్లు జ్ఞాన శేఖర్ , మనోజ్ పరమహంసా లు కలిసిచేసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. తోట తరణి వేసిన సెట్లు ముఘల్ కాలానికి తగినంత వైభవాన్ని చూపించగా, కీరవాణి సంగీతం ఎమోషన్‌కు అర్థం చెప్పే విధంగా సాగుతోంది. ప్రకాశం ఎడిటింగ్ కూడా ట్రైలర్‌ను కట్టిపడేస్తోంది.

Leave a Reply