- మాజీ ఎమ్మెల్యే ఉమా డిమాండ్..
(నందిగామ, ఆంధ్రప్రభ) : యాదాద్రి ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈరోజు (బుధవారం) మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వేదాద్రి ఎత్తిపోతల పథకానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఎత్తిపోతల పథకం మరమ్మతులు పనులు మొదలుపెట్టే వరకు ఇక్కడే ఉంటానని భీష్మించుకుని కూర్చున్న ఆయన రాత్రి కూడా పథకం వద్దనే నిద్రించారు. పనులు ప్రారంభించేంతవరకు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదంటూ పథకం ప్రాంతం వద్దే ఉన్నారు.