Edgbaston Test | హాఫ్ సెంచ‌రీతో క‌దం తొక్కిన జైస్వాల్.. తొలి సెషన్ లో భార‌త్ స్కోర్ !

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్ లో బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ముందుగా బ్యాటింగ్ కు దిగిన భార‌త్… తొలి సెషన్ ముగిసే సమయానికి 98/2తో నిలిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి అద్భుతంగా రాణిస్తూ 62* పరుగులతో క్రీజులో ఉన్నాడు.

ఇతర బ్యాటర్లంతా తడబడుతున్న‌ప్పటికీ, జైస్వాల్ మాత్రం స్థిరంగా కనిపించాడు. ఈ క్ర‌మంలో జైస్వాల్ తన 11వ టెస్ట్ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ఇంగ్లాండ్‌పై నాలుగో అర్ధశతకం కావడం విశేషం. అతనికి తోడుగా ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (1*) ఉన్నాడు.

ఓపెనర్లు కేఎల్ రాహుల్, జైస్వాల్ జాగ్రత్తగా ఆరంభించారు. అయితే రాహుల్ పూర్తిగా స్థిరపడలేకపోయాడు. క్రిస్ వోక్స్ తన అద్భుతమైన లెంగ్త్‌తో క్లీన్‌బౌల్డ్ చేయ‌డంతో రాహుల్ 2 పరుగులకే వెనుదిరిగాడు.

ఆ తర్వాత వ‌చ్చిన‌ కరుణ్ నాయర్ – జైస్వాల్ కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ లంచ్‌కు ఒక ఓవ‌ర్ ముందు బ్రిడన్ కార్స్ కరుణ్‌ను అవుట్ చేశాడు.

కాగా, ఈ మ్యాచ్ కు భారత్ ఈ మ్యాచ్ కోసం మూడు మార్పులు చేసింది. బుమ్రా, శార్దూల్ ఠాకూర్, సాయి సుదర్శన్‌లను తుది జట్టులోనుంచి తప్పించి… నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్‌లకు అవకాశం ఇచ్చింది.

Leave a Reply