IRCTC | రైల్వే టిక్కెట్ బుకింగ్‌లో భారీ మార్పు..

  • ఇకపై నచ్చిన సీటు బుక్ చేసుకోవ‌చ్చు !
  • అందుబాటులోకి ‘‘రైల్ వ‌న్” యాప్

భారతీయ రైల్వే టిక్కెట్ బుకింగ్ వ్యవస్థలో మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటి వరకు ఐఆర్‌సీటీసీ (IRCTC) వంటి ప్లాట్‌ఫామ్‌లలో టిక్కెట్ బుక్ చేస్తే సీటు ఆటోమేటిక్‌గా కేటాయించేవారు. అయితే. ఇకపై ప్రయాణికులు తమకు నచ్చిన కోచ్, సీటును స్వయంగా ఎంపిక చేసుకునే వెసులుబాటు రాబోతుంది.

ఈ మార్పు కోసం రైల్వే శాఖ “మోడరన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)”ను రూపొందిస్తోంది. 2025 డిసెంబర్ నాటికి ఇది పూర్తి స్థాయిలో అమలులోకి రానుంది. కొత్త సిస్టమ్‌లో ప్రతి బోగీకి సంబంధించిన డిజిటల్ సీటింగ్ మ్యాప్‌ను చూపించనున్నారు. ఖాళీగా ఉన్న సీట్లు, బుక్ అయినవేంటో స్పష్టంగా కనిపిస్తాయి. ప్రయాణికులు తమ అవసరాలకు అనుగుణంగా లోవర్ బర్త్, కిటికీ పక్కన సీట్లు, పక్కపక్కన బెర్త్‌లు వంటి ఎంపికలు చేసుకోవచ్చు.

ఈ సౌకర్యం ప్రయాణికులకు అనేక లాభాలను అందించనుంది. కుటుంబంగా ప్రయాణించేవారు ఒకే కోచ్‌లో సీట్లు పొందే అవకాశాన్ని పొందుతారు. వృద్ధులు, గర్భిణీలు, పిల్లలతో ఉన్న తల్లులు తమ అవసరాల మేరకు సీటు ఎంచుకోవచ్చు. టిక్కెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా మారడంతో, సందేహాలు, అసౌకర్యాలకూ చెక్ పడనుంది.

ఈ మార్పు ద్వారా రైల్వే టిక్కెట్ బుకింగ్ అనుభవం విమానయానానికి సమానంగా మారనుంది. ప్రయాణికుల ఇష్టాలకు అనుగుణంగా మారుతున్న ఈ పరిణామం భారతీయ రైల్వే టెక్నాలజీలో గేమ్ ఛేంజర్‌గా నిలవనుంది.

రైల్వే సూపర్‌ యాప్‌ వచ్చేసింది..

రైల్వే శాఖ సేవలూ అన్ని ఒకే చోట లభించేలా రైల్ వన్ పేరిట దేశ ప్రజలకు కొత్తయాప్ అందుబాటులోకి తెచ్చింది. తొలుత స్వరైల్‌ పేరిట ఈ సూపర్‌ యాప్‌ను పరీక్షించిన రైల్వే శాఖ.. తాజాగా రైల్‌వన్ పేరుతో యాప్ ను పౌరులందరికీ అందుబాటులోకి తెచ్చింది.

రైల్ వన్ యాప్ తో (ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌) రిజర్వ్‌డ్‌/అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లు, ప్లాట్‌ఫామ్‌ టికెట్లు, రైళ్ల ఎంక్వైరీ, పీఎన్‌ఆర్‌, జర్నీ ప్లానింగ్‌, రైల్‌ మదత్, ఫుడ్‌ ఆన్‌ ట్రైన్‌ వంటి అన్ని సేవలు పొందవచ్చు.

Leave a Reply