Delhi | కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ భేటీ

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ కార్యవర్గం కూర్పు వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగింది.

ఈ సమావేశంలో సీఎం రారేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేకుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఇక‌ ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న రేవంత్ రెడ్డి బృందం.. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు కాంగ్రెస్ నేతలతో భేటీ కానుంది. రేపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్‌తో సీఎం రేవంత్ బృందం భేటీ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *