KHM | పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

పినపాక : భద్రాద్రి జిల్లా పినపాక (Pinapaka) నియోజకవర్గం పరిధి ఆళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), మహబూబాద్ పార్లమెంటు సభ్యులు పోరికం బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా శనివారం కస్తూర్బా బాలికల పాఠశాల ప్రహరీ గోడ ప్రారంభోత్సవం, ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ, లబ్ధిదారులకు అధికార ద్రువ‌పత్రాలు అందజేసి, మండల సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు.

తొలుత పాఠశాల ప్రహరీ గోడ ప్రారంభంతో పాటు ప‌లు కార్య‌క్ర‌మాలు చేసిన‌ మంత్రి పొంగులేటి, ఎంపీ బలరాం నాయక్ (MP Balaram Nayak), ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (Payam Venkateswarlu) పర్యటన దిగ్విజయంగా ముగించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, వివో రాహుల్, సీఈవో నాగలక్ష్మి, డీఆర్డిఏ ఏఈ రవి, మండల ఎంపీడీవో ధీరావత్ శ్రీను, ఏఐసీసీ నెంబర్, బూర్గంపాడు మాజీ జెడ్పిటిసి బట్ట విజయ గాంధీ, మండల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామనరసయ్య, కాంగ్రెస్ కో ప్రచార కమిటీ సభ్యులు వాసం శ్రీకాంత్, మండల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, వార్డు సభ్యులు, యువత, తదితరులు పాల్గొన్నారు. పర్యటనలు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డిఎస్పి చంద్రబాను, సీఐ సురేష్, ఎస్ఐ సోమేశ్వర్, పోలీస్ సిబ్బంది గట్టు బందోబస్తు నిర్వహించారు.

Leave a Reply