KNL | హోటళ్లపై విజిలెన్స్ దాడులు..

కర్నూల్ బ్యూరో : కర్నూలు నగరంలోని, నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో గల ఏబీ చాయ్ కేంద్రంపై గురువారం ఫుడ్ కల్తీ నియంత్రణ, విజిలెన్స్ అధికారుల దాడులు నిర్వహించారు. కల్తీగా ఉత్పత్తి అయిన పాలు, నెయ్యి విక్రయిస్తున్నారన్న సమాచారంతో విజిలెన్స్, ఆహార నియంత్రణ శాఖ అధికారులు కలిసికట్టుగా ఈ దాడులు నిర్వహించారు.

దాడుల్లో ఎటువంటి లేబుళ్లు లేకుండా ప్లాస్టిక్ కవర్ లో ప్యాకింగ్ చేసిన పాల ప్యాకెట్లు, నెయ్యి ప్యాకెట్లను సీజ్ చేశారు. నెయ్యి ప్యాకెట్లపై లేబుల్ ఉన్నప్పటికీ.. వాటీని విడిచేసి రూ.700 ఉన్న వాటిని, వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నట్లు అధికారుల దాడుల్లో వెలుగు చూసింది. ఇలా చేయడం ఆహార కల్తీ నియంత్రణ చట్టం మేరకు విరుద్ధం. దీంతో సంబంధిత దుకాణదారుని లైసెన్సులను అధికారులు పరిశీలించారు.

ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న పాలు, నెయ్యి ప్యాకెట్లను హైదరాబాదులోని ల్యాబ్ కు పంపించినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి ల్యాబ్ రిపోర్టులు వచ్చిన అనంతరం వాటిలో కల్తీ జరిగిందా లేదా అన్న వాటిని నిర్ధారించనున్న‌ట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో ఆహార కల్తీ నిరోధక శాఖ ఉన్నత స్థాయి అధికారి కూర్మా నాయక్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి సిద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *