TFCC | సునీల్ నారంగ్ రాజీనామా… అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే !

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్ నారంగ్ (Sunil Narang) రాజీనామా (resigns) చేశారు. మూడోసారి అధ్యక్షుడిగా ఎంపికైన ఆయన, పదవి చేపట్టిన కేవలం 24 గంటల వ్యవధిలోనే పగ్గాలు వదిలేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ మేర‌కు ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ‘‘తన అనుమతి లేకుండా కొంతమంది వ్యక్తులు మీడియా ముందుకొచ్చి అనవసర వ్యాఖ్యలు చేయడంతో తనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఆ ప్రకటనలతో తాన‌కు సంబంధం లేనప్పటికీ, తనను దానికి బాధ్యుడిగా చూపించడం తగదని అభిప్రాయపడ్డారు.

ఇలాంటి పరిస్థితుల్లో తన పాత్రను నిబద్ధతతో నిర్వర్తించడం అసాధ్యమని భావించిన సునీల్ నారంగ్, తాను ఇకపై పదవిలో కొనసాగలేనని స్పష్టం చేశారు. అందుకే తక్షణమే తన రాజీనామాను సమర్పిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

ఇకపై ఛాంబర్ కార్యనిర్వాహక వ్యవస్థ కొనసాగేందుకు తగిన వ్యక్తిని నియమించాలని కోరుతూ, తన రాజీనామా లేఖను అధికారికంగా స్వీకరించాలని ఛాంబర్‌ను ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *