ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న మాజీమంత్రి తలసాని పర్యటన

హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ) : బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Talasani Srinivas Yadav) ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆస్ట్రేలియా పర్యటనకు (Australia Tour) వెళ్లారు. ఆయనకు పలు ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సిడ్నీ నగరంలో నిర్వహించిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, యువనేత తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌ లు పాల్గొన్నారు. తెలుగు వారిని ఇక్కడ కలుసుకోవడం పట్ల తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply