అమరావతి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యదర్శిగా రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు మూడవసారి నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో తనకు మరోసారి ప్రాతినిధ్యం కల్పించటం పట్ల సంఘం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షులు బీ సుగుణమ్మ, ఇతర రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు శక్తివంచన లేకుండా నిరంతరం కృషి చేస్తానని భూపతిరాజు స్పష్టం చేశారు. సూర్యనారాయణ నేతృత్వంలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఒక వేదిక అయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం, పవన్ కల్యాణ్, విద్యా, ఐటీ- శాఖ మంత్రి నారా లోకేష్‌పై తమకు నమ్మకం ఉందన్నారు.
తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కూడా ఉద్యోగ సమస్యలు పట్ల తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ, రెండు డీఏలు ప్రకటిస్తూ, పాత బకాయిలు ప్రతినెల రూ.700 కోట్లు ఉద్యోగులకు చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నందున, మన రాష్ట్రంలో కూడా ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు వస్తుందనిముఖ్యమంత్రి చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని ఉద్యోగులకు న్యాయం చేయగలరనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.