BCCI | టీమిండియా కొత్త వన్డే జెర్సీ ఆవిష్కరణ..

భారత పురుషుల క్రికెట్ జట్టు.. కొత్త జెర్సీతో వన్డే బరిలోకి దిగనుంది. తాజాగా టీమిండియా కొత్త జెర్సీ ఫోటో షూట్ వైరల్‌గా మారింది. భారత క్రికెటర్లు కొత్త జెర్సీలు ధరించి ఫొటోల‌కు ఫోజులిచ్చారు.

ఈ కొత్త జెర్సీపై ప్రత్యేకమైన ముక్కోణపు డిజైన్‌తో భుజాలపై ఉన్న రంగుల సొగసును అందంగా రూపొందించారు. అయితే, ఈ జెర్సీని గతేడాది నవంబర్‌లో మహిళా జట్టుతో పాటు బీసీసీఐ మాజీ సెక్రటరీ, ఐసీసీ చైర్మన్ జయ్ షా ఆవిష్కరించారు. ఇటీవల ఐర్లాండ్‌తో ముగిసిన స్వదేశీ సిరీస్‌లో.. హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఈ జెర్సీని మొదటిసారిగా ధరించింది.

ఇదిలా ఉంటే టీమిండియా పురుషుల జట్టు రేప‌టి నుంచి ఇంగ్లండ్ తో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్ కు ఈ కొత్త జెర్నీని ధ‌రించ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *