FOOD POISON | ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్​ పాయిజన్​ – ఒకరు మృతి!

హైద‌రాబాద్ : హైదరాబాద్​లోని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్​ పాయిజన్​ కారణంగా 30మందికి పైగా మానసిక రోగులు అస్వస్థతకు గురవ్వగా, వారికి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఒక మానసిక రోగి మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది..

Leave a Reply