వెలగపూడి – ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ నటుడు అక్కినేని నాగార్జున తన రెండో కుమారుడు అఖిల్ వివాహానికి అహ్వాన పత్రికను అందించారు.. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను నేడు నాగార్జున కలిశారు. తన కుమారుడు, యువ హీరో అక్కినేని అఖిల్ వివాహానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆయన వ్యక్తిగతంగా కోరారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు నాగార్జున అందజేశారు. ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. అఖిల్ వివాహం ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ జరగనుంది.
Invitation | రెండో వాడికి పెళ్లి … మీ అశీస్సులు కావాలి – చంద్రబాబుకు నాగార్జున ఆహ్వానం
