న్యూ ఢిల్లీ : రెడియో పరికరాలు, వాకీటాకీల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఈ కామర్స్ సంస్థలు అనుమతులు లేకుండా వాకీటాకీలు అమ్మడంపై ఆంక్షలు విధించింది.
టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, వైర్లెస్ టెలిగ్రపీ యాక్ట్ 1933 ప్రకారం.. వాకీటాకీల అమ్మకాలు చేపట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. టెలికం భద్రతా సమస్యలను పరిష్కరించడానికే ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్టు పేర్కొంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతాపరమైన ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో వాకీ-టాకీలు సహా రేడియో పరికరాల అనధికార అమ్మకాలను నిరోధించడానికి వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఈ కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
ప్రాథమిక దర్యాప్తులో కీలకమైన నియంత్రణ వివరాలను వెల్లడించడంలో విఫలమైన వందలాది జాబితాలు వెల్లడైన తర్వాత, నిబంధనలకు అనుగుణంగా లేని ఉత్పత్తులను తొలగించాలని కోరుతూ 12 ప్రధాన ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు పంపాయి..
నోటీసుకు ప్రతిస్పందనగా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మెటా (ఫేస్బుక్), చిమియా వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు నోటీసులో పేర్కొన్న అన్ని వాకీ-టాకీ ఉత్పత్తులను డీలిస్ట్ చేశాయి.
.