శ్రద్ధ జీతేష్ వి పాటిల్‌కు కొడుకుపుట్టాడు
సంతోషం వ్యక్తం చేసిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్
ప్రభుత్వ ఆస్పత్రి సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ :
తెలంగాణలోని కలెక్టర్ల సతీమణులు, అలాగే మహిళ న్యాయమూర్తి ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగడంతో వాటి ప్రాధాన్యం అమాంతంగా పెరుగుతున్నాయి. గతంలో పెద్దపల్లి ఆస్పత్రిలో కలెకర్ట్ సతీమణి, వేములవాడలో ఓ మహిళ న్యాయమూర్తి ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగాయి. బుధవారం పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ జీతేష్ వి పాటిల్ ప్రసవించారు. ఆమెకు మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఆమె గర్భవతిగా అయినప్పటి నుంచి పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్య సేవలు పొందారు. ప్రతి ఒక్క మహిళ ప్రసవ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రి సేవలు పొందాలని ఆయన సూచించారు.
