( ఆంధ్రప్రభ, శ్రీకాకుళం బ్యూరో) శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం తలతంపర గ్రామంలో అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్తు లైట్ల తీగలు తెగి సోమవారం ఉదయం ముగ్గురు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తొలుత నాలుగు సంవత్సరాల కాళిదాసు విద్యుత్ షాక్ కు గురి కాగా, గమనించిన నందిని(12) ఆ బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఆమె కూడా విద్యుత్ షాక్ నకు గురైంది .ఈ ఇద్దరు పిల్లలను చూసి రక్షించేందుకు తండ్రి ఈశ్వరరావు ప్రయత్నించారు. ఆయన కూడా విద్యుత్ షాక్ తో మరణించారు. ఈ ముగ్గురు మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మంత్రి అచ్చెంనాయడు దిగ్భ్రాంతి
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం తలతంపరలో విద్యుత్ షాక్‍తో ముగ్గురు మృతి చెందడం పట్ల మంత్రి అచ్చెంనాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులిద్దరికీ మెరుగైన వైద్యం అందించాలని కంచిలి ఆసుపత్రి వైద్యులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గ్రామ దేవత ఉత్సవాల్లో ఇటువంటి ఘటన జరగడం విచారకరమన్నారు.