Palnadu | ఇద్దరు టిడిపి వర్గీయులు దారుణ హత్య

పల్నాడు జిల్లా: జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెలుగుదేశం వర్గీయులు హత్యకు గురయ్యారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని కారుతో ప్రత్యర్దులు ఢీకొట్టారు. కిందపడిన ఇద్దరిని గొడ్డళ్లతో ప్రత్యర్దులు నరికివేశారు. మృతులు గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులుగా గుర్తించారు. వైసీపీ ప్రభుత్వంలో తోట చంద్రయ్యను వైసీపీ నేతలు నరికి చంపిన విషయం తెలిసిందే. తాజాగా అదే గుండ్లపాడుకు చెందిన ఇద్దరు టీడీపీ వర్గీయులు హత్యకు గురయ్యారు.

Leave a Reply