రైతు నుండి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత
ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ కడెం మండల సర్వేయర్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డాడు. భూమి సరిహద్దులు కొలతలు పట్టా కోసం ఓ రైతు నుండి సర్వేయర్ ఉమాజీ రూ.20 వేల లంచం ఇవ్వాలని సూచించాడు. ఈ మేరకు కడెం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన గూగులావత్ ప్రభాకర్ అనే రైతు తన తండ్రి నుండి సంక్రమించిన భూమి పట్టా కోసం ల్యాండ్ సర్వే అధికారుల చుట్టూ తిరిగాడు. బాధితుడు ప్రభాకర్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించగా శనివారం మధ్యాహ్నం తన ఆఫీసులోనే ముందుగా రూ 7వేలు వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వలపన్ని పట్టుకున్నారు. ల్యాండ్ సర్వేయర్ ఉమాజీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Adilabad | ఏసీబీకి చిక్కిన కడెం ల్యాండ్ సర్వేయర్
