Liquor Scam | క‌సిరెడ్డికి నిరాశ … క్వాష్ పిటిష‌న్ తొసిపుచ్చిన సుప్రీం కోర్టు

న్యూ ఢిల్లీ – ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆయ‌న‌ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. తన కొడుకు అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించడం లేదంటూ కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను కూడా తిర‌స్క‌రించింది.

ఈ రెండు పిటిషన్లపై గత సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు దానికి సంబంధించిన తీర్పును వెల్లడించింది. అరెస్ట్ సక్రమమా కాదా అనేదానిపై మెరిట్స్‌లో వెళ్లకుండా ఈ కేసును పూర్తిగా డిస్పోస్ చేస్తున్నామని తీర్పులో పేర్కొంది. మద్యం స్కాంలో సీఆర్పీసీ 160 ప్రకారం హైదరాబాద్‌లో ఉంటున్న తనకు నోటీసులు జారీ చేసే అధికారం ఏపీ సీఐడీకి లేదంటూ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి పంపించామని.. దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపింది. రెగ్యులర్ బెయిల్‌ వంటి విషయాలు హైకోర్టులో చూసుకోవాలని.. ఈ విషయాలను తాము ప్రస్తావించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

Leave a Reply