Amrit Bharath | క‌రీంన‌గ‌ర్ నుంచి తిరుప‌తికి రైలు తీసుకొస్తా – కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్రంలోని పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు రైల్వేల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ ఆరోపిచారు. దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ నేడు వర్చువల్‌గా బీకనీర్ (రాజస్థాన్‌) లోని పలానా పట్టణంలో ప్రారంభించారు. అలాగే బేగంపేట, కరీంనగర్, వరంగల్ అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో భాగంగా కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఎన్‌డీఆర్ స‌ర్కార్‌…
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వచ్చిన తరువాత తెలంగాణ రైల్వేస్‌కు మహర్దశ పట్టిందని అన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రైల్వేలను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని కామెంట్ చేశారు. దేశ వ్యాప్తంగా మొత్తం 1,300 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించామని పేర్కొన్నారు. ఇక రూ.27 కోట్లతో కరీంనగర్ రైల్వే స్టేషన్ డెవలప్ చేశామని తెలిపారు. త్వరలోనే అమృత్ భారత్ పథకంలో భాగంగా జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇకపై కరీంనగర్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి వారానికి నాలుగు రోజులు నడిపేలా ఇండియన్ రైల్వేస్‌ తో చర్చించి చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ అన్నారు

Leave a Reply