Saraswati Pushkaras|ఐదో రోజూ కొనసాగుతున్న భక్తజన ప్రభావం

కాళేశ్వరం – సరస్వతీ పుష్కరాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. సోమవారం సందర్భంగా కాళేశ్వర క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి సైకత లింగాలకు పూజలు చేస్తున్నారు. కాళేశ్వర ముక్తేశ్వరుడు, శుభానంద దేవిని దర్శించుకునేందుకు బారులు తీరారు.

పోటెత్తిన భక్తజనం

పుష్కరాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో ఉద్యోగులు, ఇతర రాష్ర్టాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండు లక్షల మంది వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుధ, సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ పుష్కర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కర ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌ జాయ్‌ రైడింగ్‌ను కలెక్టర్‌ రాహుల్‌ శర్మ పరిశీలించి ఏరియల్‌ సర్వే చేశారు

Leave a Reply